ETV Bharat / state

100 రోజులు.. 2328 కేసులు

కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ మహమ్మారి అనంతపురం జిల్లాలో తెరపైకి వచ్చి సోమవారం నాటికి వంద రోజులైంది. ఇప్పటిదాకా 2,328 మందికి ప్రబలింది. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. వీరంతా జిల్లావాసులే. వలస కూలీలు, ఇతర రాష్ట్ర, విదేశాల నుంచి వచ్చి వైరస్‌ బారిన పడినవారు అదనం

corona cases
corona cases
author img

By

Published : Jul 7, 2020, 9:15 AM IST

లాక్‌డౌన్‌ 4.0 దాకా అనంతపురం జిల్లాలో కరోనా అదుపులో ఉండేది. లాక్‌డౌన్‌ 5.0 తర్వాత ప్రజా రవాణాకు మినహాయింపు ఇవ్వడంతో కోరలు చాచింది. తొలి దశలో హిందూపురం వరకే మహమ్మారి తీవ్రత కనిపించింది. జూన్‌ ఒకటి నుంచి అన్‌లాక్‌ 1.0 మొదలు కాగానే జిల్లా కేంద్రంలో విజృంభించింది. దీని ప్రభావం జిల్లాంతటా కనిపిస్తోంది. ఇప్పుడు వేగంగా పాకుతోంది. ప్రతి మండలానికి విస్తరించింది. దాదాపు సగం కేసులు అనంత నగరంలోనే నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. అనంత నగరంతోపాటు హిందూపురం, ఉరవకొండ, తాడిపత్రి, యాడికి, ధర్మవరం, పెనుకొండ, కదిరి, గుత్తి తదితర ప్రాంతాల్లో కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.

జూన్‌లో అత్యధికం

ఈ ఏడాది మార్చి 29న కరోనా ఇద్దరికి సోకింది. ఆ రోజు నుంచి లెక్కిస్తే సోమవారం నాటికి వంద రోజులైంది. మార్చి నెల 3 రోజుల్లో ఇద్దరికి (0.08%), ఏప్రిల్‌లో 65 (2.79), మేలో 297 (12.76), జూన్‌లో 1325 (56.91) మందికి వచ్చింది. ఇక జులై నెల పరిశీలిస్తే.. ఆరు రోజుల్లోనే ఏకంగా 639 మందికి ప్రబలింది. 27.46 శాతం మందికి వైరస్‌ సోకింది. సగటున నిత్యం వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు.

అనంతలోనే 64

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన బులెటిన్‌లో జిల్లాలో 142 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒక్క అనంత నగరంలోనే 64 మంది ఉన్నారు. ధర్మవరంలో 15, కదిరిలో పది, హిందూపురంలో 9, తాడిపత్రి, కళ్యాణదుర్గంలో ఏడు చొప్పున, బత్తలపల్లి, పెద్దపప్పూరులో ముగ్గురు, గుత్తి, పెనుకొండ, తలుపులలో ఇద్దరేసి ఉన్నారు. బుక్కపట్నం, బీకే సముద్రం, బెళుగుప్ప, సీకేపల్లి, రాయదుర్గం, శెట్టూరు, తనకల్లు, ముదిగుబ్బ, కొత్తచెరువు మండలాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. కణేకల్లు ఎర్రగుంట్ల పీహెచ్‌సీ పరిధిలో కర్నూలుకు చెందిన తొమ్మిది మంది, కడప, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉండగా.. కేరళకు సంబంధించి ఒకరు ఉన్నారు. సర్వజనాసుపత్రిలో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.

ప్రైవేట్‌లో కొవిడ్‌ బాధితులు

మరో ఐదు ప్రైవేట్‌ ఆస్పత్రులను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని ప్రజ్ఞ, నగరంలో అమరావతి, వైఎస్‌ఆర్‌, చంద్ర, కేర్‌-క్యూర్‌ ఆస్పత్రులను కొవిడ్‌ రోగుల కోసం తీసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యులు, నర్సులే ఉంటారు. ఒక్కో ఆస్పత్రికి ఇద్దరు వైద్యులు, ఆరుగురు స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు ఇద్దరు చొప్పున నియమించారు. సోమవారమే ఆయా ఆస్పత్రుల్లో రిపోర్టు చేసుకున్నారు.

84 మంది డిశ్ఛార్జి

కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడంతో సోమవారం 84 మంది డిశ్ఛార్జి అయినట్లు కలెక్టర్‌ చంద్రుడు తెలిపారు. జిల్లాలోని కొవిడ్‌, సీసీసీ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న 84 మందిని ఇళ్లకు పంపారు. మరో 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: పోలీస్​నంటూ నమ్మించి.. యువతిపై అత్యాచారం.. ఆపై కానిస్టేబుల్​ను పిలిపించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.