ETV Bharat / state

కరోనా కాటు.. సిబ్బందికి కోవిడ్​.. తెరుచుకోని బ్యాకులు...

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ బ్యాంకు సిబ్బందిని కూడా వదలటంలేదు. సిబ్బందికి కరోనా సోకడంతో పలు మండలాల్లో బ్యాంకులు తెరుచుకోవడం లేదు. మరికొన్ని మండలాల్లోని బ్రాంచీలు కంటైన్మెంట్ జోన్లలో ఉండటంతో తప్పని పరిస్థితిలో మూసేయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 21 బ్యాంకు బ్రాంచీల్లో సిబ్బందికి కరోనా వైరస్ సోకటంతో ఎక్కడికక్కడ బ్రాంచీలను మూసివేసి సిబ్బందిని ఆసుపత్రులకు, హోం ఐసోలేషన్​కు పంపించారు.

corona affect on banks
మూతపడుతున్న బ్యాంకులు
author img

By

Published : Jul 22, 2020, 1:49 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందల మంది వైరస్ బారిన పడుతున్నారు. ఖరీఫ్ పంట రుణాల వితరణ, పాత రుణాల రెన్యూవల్ కోసం రోజూ గ్రామీణ బ్యాంకు శాఖల వద్దకు పెద్దఎత్తున రైతులు, ఖాతాదారులు వస్తుండటంతో బ్యాంకుల్లోని సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. పలు బ్యాంకుల్లో ఖాతాదారులను కట్టడి చేసి భౌతిక దూరం పాటిస్తూ చర్యలు తీసుకోవటంలో బ్యాంకు మేనేజర్లూ చొరవ తీసుకోవటంలేదు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29 బ్యాంకులకు సంబంధించి, 482 శాఖలుండగా, ఇప్పటికే 21 చోట్ల బ్యాంకు శాఖలు మూతపడ్డాయి. పలు మండలాల్లో పది రోజులకు పైగా బ్యాంకులను తెరవటంలేదు. గుత్తిలో ఒకే భవనంలో యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ శాఖలున్నాయి. యూనియన్ బ్యాంకు సిబ్బందికి వైరస్ పాజిటివ్ రావటంతో ఆ భవనంలోని రెండు బ్రాంచీలను మూసివేశారు. ధర్మవరంలో రెండు ఎస్బీఐ ప్రధానశాఖలతోపాటు, కళాజ్యోతి కూడలిలోని శాఖనూ మూసేశారు. తాడిపత్రిలో ఎస్బీఐ ప్రధానశాఖను పదిరోజుల క్రితమే మూసేశారు, సిబ్బంది విధులకు రావటానికే భయపడుతుండటంతో ఎప్పుడు ఆ శాఖను తెరుస్తారో తెలియక ఖాతాదారులు రోజూ వచ్చి వెను తిరిగిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష సేవలందించే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల శాఖల్లోనూ సిబ్బందికి వైరస్ సోకి పలు చోట్ల మూతపడ్డాయి.

జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖరీఫ్ పంట రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొందరు రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకొని వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలుచేయటానికి వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారవుతున్నాయి.

ఇదీ చదవండి: ఇకపై గ్రూప్ పాలసీగా కరోనా కవచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.