ETV Bharat / state

అదుపుతప్పి కల్వర్టులో బోల్తాపడ్డ కంటైనర్​.. ఇద్దరికి గాయాలు - అనంతపురం జిల్లా తాజా వార్తలు

వేగ నిరోధకాల వద్ద అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి ఓ కంటైనర్ బోల్తాపడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో వాహన చోదకుడు, సహాయకుడికి గాయాలయ్యాయి.

container fell into culvert
కల్వర్టులోకి దూసుకెళ్లిన లారీ బోల్తా
author img

By

Published : Feb 24, 2021, 9:44 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ కంటైనర్ అదుపుతప్పి కల్వర్టులో బోల్తాపడింది. బెంగళూరు నుంచి దిల్లీకి పార్శిల్ లోడుతో వెళుతున్న లారీ వేగ నిరోధకాల వద్ద అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో వాహన చోదకుడు రాహుల్, సహాయకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పుట్టపర్తి వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

భార్యే హత్య చేయించింది... వివాహేతర సంబంధమే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.