ETV Bharat / state

ఉన్నతాధికారుల వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - అనంతపురంలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

అనంతపురంలో ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక...కానిస్టేబుల్ ప్రకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడే ఈ ప్రయత్నం చేశాడు.

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 1, 2019, 2:25 PM IST

Updated : Nov 1, 2019, 6:03 PM IST

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

అనంతపురంలో కలెక్టర్ కారు ముందు కిరోసిన్ పోసుకొని కానిస్టేబుల్ ప్రకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారులు తనను నిత్యం వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, ఆర్.ఐ. వెంకటరమణ అవినీతి పనులకు వాడుకోవాలని చూశారని... నిరాకరించేసరికి తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. అందుకే జిల్లా కలెక్టర్‌ను కలిసి తన సమస్యను విన్నవించినట్లు ఆయన చెప్పారు.

ఇవీ చదవండి...'మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్​ను సస్పెండ్ చేయాలి'

Intro:ATP :- అనంతపురంలో కానిస్టేబుల్ కలెక్టర్ కారు ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురంలో తమపై అధికారులు తనను నిత్యం వేధిస్తున్నారంటూ బాధితుడు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆరోపించారు. అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, ఆర్ ఐ వెంకటరమణ వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలకు తనను అడ్డు పెట్టుకోవాలని చూడగా అలాంటి పనులు చేయనని నిరాకరించడంతో తనపై లేనిపోని ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి నిత్యం మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Body:దళితులనే చిన్నచూపు చూస్తూ తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పదోన్నతుల సైతం రానివ్వకుండా నిత్యం ఇబ్బందులు పెడుతున్నారని తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇందుకోసం జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నా అన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బైట్...... ప్రకాష్, ఏ ఆర్ కానిస్టేబుల్, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

సార్ మరికొన్ని విజువల్స్ ఉన్నాయి మరో ఫైర్ లో సెండ్ చేస్తాను పరిశీలించగలరు.
Last Updated : Nov 1, 2019, 6:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.