ETV Bharat / state

'మీటర్లు బిగిస్తే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించినట్లే' - sailajanath fire on state government

అనంతపురం జిల్లా నాయనపల్లిలో కోటి సంతకాల సేకరణను చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు శైలజానాథ్, తులసీరెడ్డి తదితరులు హాజరయ్యారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

congress leaders thulasireddy, sailajanath fire on state government
నాయనపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
author img

By

Published : Oct 30, 2020, 6:17 PM IST

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే... మేం అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో నిలవడం శోచనీయమన్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయనతో పాటు, తులసీరెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలోని రైతులను వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతుల మెడకు ఉరి తాళ్లు బిగించినట్లేననని దుయ్యబట్టారు.

ఇదీచదవండి.

స్టీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.