అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం పేద్దహోతూరులో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం వాగ్వాదానికి దారి తీసింది. సంక్షేమ పథకాల గురించి అడిగినందుకు వాలంటీర్ బంధువులు తనపై దాడి చేశారని.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయులు ఆరోపించారు. వాలంటీర్లుగా మహిళలు ఉంటే... ఆ ఉద్యోగం వాళ్ల భర్తలు చేస్తూ గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. రైతుబరోసా, రేషన్ కార్డు ఇతర సమస్యలు ఏదైనా ఉంటే ఇంటికే రమ్మనడం సరైన సమాధానం చెప్పకపోవడం లాంటివి చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.
ఇదీ చూడండి..