అనంతపురం నగరంలో కరోనా కట్టడిలో భాగంగా రెండు రోజులపాటు పూర్తి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. వర్తక వాణిజ్య సముదాయాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు శనివారం, ఆదివారం దుకాణాలను పూర్తిగా మూసివేయడానికి చర్యలు చేపట్టారు.
పోలీసులు నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులను హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని సీఐ జాకీర్ హుస్సేన్ కోరారు.
ఇదీ చూడండి: