అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులపై పోలీసులకు పీఠాధిపతి శివనారాయణస్వామి ఫిర్యాదు చేశారు. శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం హోస్‌పేట పీఠాధిపతి శివనారాయణ.. ఎమ్మెల్యే కాపు అనుచరులు తమను బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని రెండు హెక్టార్లలో మైనింగ్ చేసుకుంటుండగా ఆ భూమిని వదిలేసి వెళ్లాలని బెదిరిస్తూ... మైనింగ్ చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్ని అనుమతులతో మైనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
లక్కీ బిల్డర్స్, అమర్నాథరెడ్డిలు క్వారీ సైట్ వద్దకు వచ్చి బెదిరిస్తున్న విషయం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెప్పినా న్యాయం చేస్తామని... పట్టించుకోలేదన్నారు. తమకు రక్షణ కల్పించి, ఎమ్మెల్యే అనుచరులైన అమర్నాథరెడ్డి, లక్కీబిల్డర్ అధినేతలపై కేసులు నమోదుచేయాలని ఎస్పీని... శివనారాయణ కోరారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉన్న అమర్నాథరెడ్డి ఫొటోతో పాటు ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనాలు క్వారీ వద్దకు వెళ్లి బెదిరించి వెళుతున్న వాహనం ఫొటోలను ఎస్పీకి అందజేశారు.
ఇదీ చదవండి:
New Asian Enclosure: తిరుపతి జంతు ప్రదర్శనశాలలో కొత్త అనుభూతి