ETV Bharat / state

కొవిడ్​ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్​ - అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు తాజా వార్తలు

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రుల రికార్డులు, పరిసర ప్రాంతాలు పరిశీలించారు. కరోనా బాధితులతో మాట్లాడి వారి పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి, ఆసుపత్రి సూపరింటెండెంట్​కు దిశానిర్దేశం చేశారు. అనంతరం తిమ్మాపురం ఆయూష్​ ఆసుపత్రిని సందర్శించి కొవిడ్​ బాధితుల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

collector visits guntakal govt hospital in ananthapur district
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్​
author img

By

Published : Aug 21, 2020, 7:14 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని ఆవరణను, రికార్డులను పరిశీలించారు. కరోనా రోగులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భయాన్ని వీడాలని తెలిపారు. అనంతరం తిమ్మాపురం గ్రామం వద్ద కొవిడ్​ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 150 పడకల ఆయుష్​ ఆసుపత్రిని పరిశీలించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి కోరనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. కొవిడ్​ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి చికిత్స అందించి... తక్కువ లక్షణాలు కలిగిన వారిని కొవిడ్​ కేర్​ సెంటర్​కు తరలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​ని ఆదేశించారు.

పాజిటివ్​ వచ్చిన వారి బెడ్ల వద్ద స్విచ్​లను ఏర్పాటు చేసి కాలింగ్​ బెల్​ సదుపాయం కల్పించాలని, వారికి ఎటువంటి అవసరం వచ్చినా... వైద్యులు అందుబాటులో ఉంటి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. శానిటేషన్​కు సంబంధించిన శుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే తక్షణం వారి శాంపిల్​ సేకరించి టెస్టింగ్​ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్​ డెస్క్​ వద్ద బ్లాక్​ బోర్డులో అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

అనాథలైన చిన్నారులకు జేసీ అస్మిత్​రెడ్డి చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.