గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సమస్య ఏదైనా పది రోజుల్లో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గొటుకూరు గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయానికి వస్తున్న ఫిర్యాదులు, తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో రోడ్డు నిర్మాణం, కొంత మందికి పింఛన్ మంజూరు గురించి కలెక్టర్కు విన్నవించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: