ఉపాధి హామీ పనుల కల్పనలో జిల్లాలో ఒక్కరోజులోనే 5 లక్షల 80 వేల మందికి ఉపాధి పనులు కల్పించి రికార్డ్ సృష్టించామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశంలోనే రెండవ స్థానంలో నిలిచామని తెలిపారు. పనుల కల్పనలో లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. నార్పల ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించారు.
మండలంలో కూలీలకు కల్పిస్తున్న ఉపాధి పనుల మాన్యువల్ రికార్డులను, కంప్యూటర్లో అప్లోడ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉపాధిహామీ ప్రారంభమైన నాటి నుంచి కూలీలకు కల్పించిన పనుల వివరాలను నోట్ రూపంలో తనకు అందించాలని ఎంపీడీవోను ఆదేశించారు.