సీఎం జగన్ ఈనెల 8న అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించనున్న సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు స్థలం, గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ భవనాలను , సభాస్థలి ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. సభ ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటనలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. TELUGU YUVATA:'వైకాపా అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటం'