ETV Bharat / state

Jagan: వసతి దీవెన నిధులు విడదలకు మహుర్తం ఖరారు.. ఈ నెల 26న అనంతలో సీఎం పర్యటన - వసతి దీవేన వివరాలు

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ఎల్లుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని అధికారులు వెల్లడించారు.

cm jagan tour
జగన్
author img

By

Published : Apr 24, 2023, 10:05 PM IST

సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 17న జరగాల్సిన ఈ వసతి దీవెన కార్యక్రమాని నిధుల లేమి కారణంగా వాయిదా పడింది. కార్యక్రమం వాయిదాపై సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చారు. నిధులు లేకపోవడంతోనే వసతి దీవెన కార్యక్రమం వాయిదా పడిందని వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విభజన హాామీల్లో భాగంగా రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివిద శాఖల అధికారులతో తాము దిల్లీ వెళ్తామని, అవసరమైతే.. ఈ టూర్ కు సీఎం కూడా హజరవుతారని జవహర్ రెడ్డి ప్రకటించారు. విభజన నాటి రెవెన్యూ లోటు సహా పోలవరం , తెలంగాణ నుంచి జెన్కోకు రావాల్సిన బకాయిల విషయంలోనూ కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉన్నందున సీఎం అధికారులతో పాటుగా దిల్లీ పర్యటన చేయాలనుకున్నట్లు అప్పట్లో సీఎస్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ నెల 26వ తేదీన జగనన్న వసతి దీవెనకు మూహర్తం ఫిక్స్ కావడంతో.. అనంతపురం జిల్లాలో జరిగే కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

వసతి దీవెనకు ముహూర్తం ఖరారు కావడంతో.. సీఎం టూర్​ను విజయవతం చేసేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దీంతో ఈ సభను విజవంతం చేసేందుకు.. స్థానిక నేతలు జనసమీకరణపై దృష్టి పెట్టగా, అధికారులు సీఎం భద్రపై దృష్టి పెట్టారు. 26వ తేది ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు సీఎం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఉ 10.40 గంటలకు నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

గతంలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. రాష్ట్రం అప్పకుప్పగా మారిపోయిందని.. చివరకు వసతి దీవెనకు నిధుల కోసం దిల్లీ వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ కార్యక్రమం వాయిదై వెనుక వైఎస్ వివేక హత్యకేసు సీబీఐ విచారణ ప్రభావం ఉందని ఆరోపించాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్లే సీఎం అనంతప పర్యనట రద్ధు చేసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.