ETV Bharat / state

వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ.. 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసం

అనంతపురం జిల్లా మడకశిర మండలం దిగువ గొల్లహట్టి గ్రామంలో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కావటంతో పాటు.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

clashes between ysrcp and tdp leaders
వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 4, 2021, 3:36 PM IST

అనంతపురం జిల్లా దిగువ గొల్లహట్టి గ్రామంలో అధికార, విపక్ష పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా మద్దతుతో గెలిచిన సర్పంచ్​, వార్డు సభ్యులు నిన్న ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దిగువ గొల్లహట్టి గ్రామం వరకు గెలుపొందిన అభ్యర్థులు ప్రదర్శనగా వెళ్లారు. ఆ సమయంలో టపాసులు కాల్చటంతో రెండు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. దీంతో వైకాపా వర్గీయులు తెదేపా వర్గంపై దాడి చేశారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడటంతో పాటు.. తెదేపా నాయకులకు చెందిన 15 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను వారించారు.

గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకులను మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పరామర్శించారు.

ఇదీ చదవండీ.. 'అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.