Clashes between two groups: ట్రాక్టర్‌ను నిలిపేందుకు పక్కకు జరగు అన్నందుకు ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌తో గొడవ పడ్డాడు. ఆ గొడవ కాస్తా పెద్దదై 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.
బాధితులు తెలిపిన మేరకు..
అనంతపురం జిల్లా కొట్నూరుకు చెందిన శ్రీరాములు (తెలుగుదేశం పార్టీ నాయకురాలి బంధువు) శనివారం రాత్రి ట్రాక్టర్‌ను నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా గంగప్ప అనే వ్యక్తి అడ్డుగా ఉండడంతో పక్కకు జరగమన్నాడు. ఈ విషయంలో గంగప్పకు కోపం వచ్చి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ అంతటితో ముగిసిపోయింది. కానీ కక్ష పెంచుకున్న గంగప్ప మరికొంత మంది వైకాపా నాయకులతో వచ్చి శ్రీరాములు(ఆ సమయంలో ఇంట్లో లేడు) కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఆ దాడిలో శ్రీరాములు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: AMARAVATHI FARMERS: తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే..హైకోర్టుకు వెళ్తాం: శివారెడ్డి