Clash between two communities : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత వాతావరణానికి దారి తీసింది. ఈ దాడులలో రెండు వర్గాలకు సంబంధించి 10 మందికి గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఇరు వర్గాలకు చెందినవారు.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని కర్రలతో దాడులు చేసుకోవడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఏడుగురుని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరో ముగ్గురిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం ఓ విషయం గురించి ఇద్దరు యువకుల మధ్య గొడవ జరగగా ఈ గొడవ చిలికి చిలికి ఈ పెను వివాదానికి దారి తీసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిపై చిన్నపాటి వివాదంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురిపై పోలీసులు కేసును నమోదు చేశారు . అయితే ఈ రోజు దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన.. ఏరియా నుంచి ఓ చిన్నపాటి ర్యాలీ నిర్వహించి.. సమావేశం నిర్వహించారు.
దీనికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర్లో ఉండగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఓ వర్గం వారు ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఎలా ఊరికే చూస్తూ ఉంటారని ఆ గ్రామంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వద్దకు వెళ్లి వివాదం గురించి చెప్పి తమకు న్యాయం చేయాలని ప్రశ్నించారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి పరస్పరం రాళ్లు రువ్వుకొనేంత ఘర్షణకు దారి తీసి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.. ఒకానొక దశలో కళ్ళలో కారం చల్లి కొట్టుకునేంత దూరం వెళ్లింది గొడవ. దీంతో గ్రామంలో పోటా పోటీగా జనం గుమిగూడి అరుపులు, కేకలతో భారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి కొనకొండ్ల గ్రామంలో ఎటువంటి రాత్రి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలని రప్పించి భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఇరు వర్గాలను చెదరగోట్టే ప్రయత్నం చేయడంతో.. పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయి.
ఇవీ చదవండి :