అనంతపురంలో ప్రధాన చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ల ఆధ్వర్యంలో రాత్రి నుంచే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సప్తగిరి కూడలిలోని సీఎస్ఐ చర్చిలో భక్తులను ఆకట్టుకునేలా చర్చిని అలంకరించారు. యువత వాటి వద్ద సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. క్రీస్తు మరణం జననం ప్రజల ప్రేమానురాగాల కోసమేనని పాస్టర్లు భక్తులకు బోధించారు. క్రీస్తు జనన చరిత్రను తెలియజేశారు. ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్లు ఏసు బోధనలను, ప్రత్యేక సందేశాలను ఇచ్చారు.
ఇదీ చదవండి: