అనంతపురం జిల్లా రాయదుర్గం మళ్లిపల్లిలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరిగింది. ఏటా సంక్రాంతి అనంతరం పుష్యమాసం బహుళ సప్తమి రోజుల్లో శ్రీ తోగట వీర క్షత్రియ సంఘం, భక్తులు ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డప్పులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు మొక్కులు తీరడం కోసం దబ్బనాలతో చెక్కిళ్ళలో, గొంతులో గుచ్చుకున్నారు. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి, జబ్బులు, ఇంటి సమస్యలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ సంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తుందని భక్తులు చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటీ పడతారని చెప్పారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి ఊరేగింపు చూడటానికి అక్కడి స్థానికులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారని తెలిపారు
ఇవీచదవండి