ETV Bharat / state

పరిహారం కోసం చిత్రావతి నిర్వాసితుల పడిగాపులు - తాడిమర్రిలో పరిహారం అందని చిత్రావతి జలాశయ నిర్వాసితులు

ముంపు ధాటికి తట్టుకోలేక, బయటకు ఎక్కడకూ వెళ్లలేక.. చిత్రావతి జలాశయ నిర్వాసితులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారుల ఒత్తిడి.. మరోవైపు పరిహారం అందక ఇబ్బందికి గురవుతున్నారు. మహిళలు, వృద్ధులు తేడా లేకుండా పొలాల్లో, అడవుల్లో డేరాలు వేసుకుని జీవిస్తున్నారు. తమ గోడు పట్టించుకోవాలంటూ.. ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు.

chitravati reservoir flow victims
చిత్రావతి నిర్వాసితుల బాధలు
author img

By

Published : Nov 1, 2020, 5:33 PM IST

అనంతపురం జిల్లా తాడిమర్రిలోని.. చిత్రావతి జలాశయ ముంపు గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పరిహారం ఇవ్వకుండానే గ్రామాలను ముంచేశారు.. బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించి కూల్చేశారు. నిర్వాసితులు బంధువుల ఇళ్లల్లో.. పొలాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. జలాశయంలో 8.5 టీఎంసీలు నింపిన అధికారులు.. పది టీఎంసీలు నింపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలోకి నీరు చేరింది. గ్రామంలో విద్యుత్తు సరఫరా తొలగించారు. ఇళ్లను జేసీబీలతో అధికారులు కూల్చివేయిస్తున్నారు. పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించడం లేదు. గ్రామంలో దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ప్రశ్నించిన రైతుపైనే తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇళ్లు కూలుస్తుండగా ఎక్కడకు వెళ్లాలో తెలియక గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గ్రామం వెలుపల గుడారాలు వేసుకుని ఉంటున్నారు.

నాలుగు గ్రామాల్లో ముంపు:

చిత్రావతి జలాశయ ముంపు పరిధిలో నాలుగు గ్రామాలు ఉన్నాయి. అందులో తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి, సీసీరేవు, ముదిగుబ్బ మండలం పెద్దచిగుళ్లరేవు, రాఘవపల్లి. ఆయా గ్రామాల్లో నిర్వాసితులు 2,009 మంది ఉన్నట్లు గుర్తించారు. పరిహారం కోసం ప్రభుత్వం రూ.240.53 కోట్లు మంజూరు చేసింది. పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేయించాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో ఇవ్వకుండానే.. రాజకీయ ఒత్తిడితో అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారు.

కూతురు పెళ్లి ఘనంగా చేయలేకపోయాం:

మా కుమార్తెకు ధర్మవరానికి చెందిన యవకుడితో పెళ్లి నిశ్చయమైంది. సంఘమేశ్వరంలోని తితిదే కల్యాణమండపంలో కొద్దిపాటి బంధువుల సమక్షంలో వేడుక పూర్తిచేశాం. ఇంటి వద్ద అతిథితులందరికీ విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ముంపు నీరు గ్రామంలోకి వస్తుందని, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. గ్రామంలో తాగునీరు, ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఇంటికి వచ్చిన అతిథులకు తాగడానికి నీళ్లు లేక, విద్యుత్తు లేక అందరూ అర్ధరాత్రే చెప్పాపెట్టకుండానే వెళ్లిపోయారు. అల్లుడు మొహం కడుక్కోవడానికి నీళ్లు లేకపోతే పది కి.మీ వెళ్లి తెచ్చాం. - తిరుపాలమ్మ, శివయ్య, మర్రిమాకులపల్లి

పదెకరాలు ముంపు:

పది ఎకరాల పొలం ముంపునకు గురైంది. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. కూలీ పని చేస్తూ.. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా. పరిహారం ఇవ్వాలని అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చాను. అర్హుల జాబితాలో నాపేరు చేర్చలేదు. గ్రామం ముంపునకు గురవుతోంది. ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నారు. పరిహారం అందకుండా ఎలా ఖాళీ చేయాలి. న్యాయం జరిగేంత వరకు గ్రామంలోనే ఉంటా. - శశికళ, రాఘవపల్లి

మాగోడు పట్టించుకోలేదు:

ముంపునకు ఇల్లు కోల్పోతున్నాం. పునరావాస పరిహారం కోసం అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. గ్రామంలోకి నీరు వస్తోందని, ఇంటిని ఖాళీ చేయమని చెబుతున్నారు. ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయాలి. నాకు నలుగురు ఆడపిల్లలు. కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నా. పలుమార్లు అర్జీ ఇచ్చినా జాబితాలో పేరు చేర్చలేదు. - లక్ష్మీనారాయణమ్మ, పెద్దచిగుళ్లరేవు

ఆడపిల్లతో అడవిలో ఉండాలా?

పరిహారం కోసం గ్రామస్థులంతా కలిసి పోరాడుతూనే ఉన్నాం. పరిహారం ఇవ్వకుండానే ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇంటిని కూల్చివేస్తే అమ్మాయిని తీసుకుని అడవిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వృద్ధులు, మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. నష్టపరిహారం ఇస్తే మేమంతా ఖాళీ చేస్తాం. మా గురించి పట్టించుకునే అధికారులు, నాయకులు లేరు. - సుభాషిణి, మర్రిమాకులపల్లి

అర్హులందరికీ న్యాయం:

ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మర్రిమాకులపల్లిలో అర్హులందరికీ పునరావాస పరిహారం తప్పక అందుతుంది. రెండో జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ఎస్సీలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. చిత్రావతి జలాశయం నుంచి నీరు మర్రిమాకులపల్లిలోకి చేరుతుండటంతో ఖాళీ చేయాలని వారి క్షేమం కోసమే చెబుతున్నాం. - మధుసూదన్‌, ఆర్డీవో

chitravati reservoir flow victims
చిత్రావతి నిర్వాసితుల బాధలు

ఇదీ చదవండి: కూల్చివేతలతో చిత్రావతి ముంపు గ్రామంలో ఉద్రికత్త

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.