అనంతపురం జిల్లా కదిరిలో ఓ ప్రైవేటు చిట్‌ఫండ్ సంస్థ కార్యాలయానికి తాళం వెశారు. పట్టణానికి చెందిన శంకర్ చారి ఇంటి పత్రాలను పెట్టి రుణం పొందారు. నిబంధనల ప్రకారం గడువులోగా అప్పు చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించినట్టు సంబంధిత కార్యాలయం నుంచి పత్రాన్ని పొందారు. అప్పటి నుంచి ఇంటి దస్తావేజులు ఇవ్వాలంటూ చిట్‌ఫండ్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. 8 నెలలు గడిచినా ఫలితంలేకపోయింది. తన ఇంటిని వేరే వారికి అమ్మానని.. రిజిస్ట్రేషన్ కోసం తన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరారు. తన సమస్యపై కంపెనీ వారు స్పందించకపోవటంతో కార్యాలయానికి తాళం వేశాడు. తన పత్రాలు ఇచ్చేవరకు తాళం తీయనని.. బైఠాయించారు.
ఇంటి పత్రాలు ఇవ్వటంలేదని కార్యాలయానికే తాళం - loan
తీసుకున్న అప్పు చెల్లించి 8 నెలలైన తన ఇంటి పత్రాలను ఇవ్వలేదని..కదిరిలో ఓ ప్రైవేటు చిట్‌ఫండ్ సంస్థకు తాళం వేశారు.