రైతులు కష్టపడి పెంచుకున్న చెట్లను నరికేసే సంస్కృతికి... వైకాపా నేతలు తెరలేపారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా... ధర్మవరం వెళ్లే మార్గంలో బుక్కరాయసముద్రంలో చంద్రబాబు ఆగారు. అధినేతకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. శింగనమల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో.. కాసేపు రోడ్ షో నిర్వహించారు. ఓటమితో ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరం కలసి కట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి...కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు