ETV Bharat / state

అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థిని ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా అరాచకాలపై.. తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. రాయదుర్గంలో అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి ఈరన్నను ఆయన ఫోన్​లో పరామర్శించారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని.. తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

chandrababu phone call to kidnapped sarpanch candidate in ananthapur district
అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థిని ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు
author img

By

Published : Jan 31, 2021, 2:26 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి ఈరన్నను.. తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు. అపహరణకు గురైన ఘటన గురించి.. ఈరన్న చంద్రబాబుకు వివరించారు. పోటీచేస్తే చంపేస్తామని వైకాపా వర్గీయలు బెదిరించినట్లు తెలిపారు.

రాయదుర్గంలో వైకాపా దౌర్జన్యాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని.. తనకు తెదేపా అండగా ఉంటుందని ఈరన్నకు హామి ఇచ్చారు.

మాజీ మంత్రి కాలవ పరామర్శ

కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఈరన్నను.. మాజీ మంత్రి, తెదేపా నేత కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. తెదేపా అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. అభివృద్ధి జరగక ప్రజల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.