paritala ravi death anniversary: పరిటాల రవి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. పరిటాల రవి.. సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గర్జించారని.. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారని చంద్రబాబు కొనియాడారు. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత అని చంద్రబాబు అన్నారు. ప్రజాసేవే ఊపిరిగా బతికి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి పరిటాల రవి అని లోకేశ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పరిటాల విగ్రహానికి తెదేపా నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు.
-
సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గర్జించిన నేత శ్రీ పరిటాల రవి. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన నాయకుడు పరిటాల రవీంద్ర. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత పరిటాల రవి.(1/2) pic.twitter.com/t35n5aHqHE
— N Chandrababu Naidu (@ncbn) January 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గర్జించిన నేత శ్రీ పరిటాల రవి. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన నాయకుడు పరిటాల రవీంద్ర. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత పరిటాల రవి.(1/2) pic.twitter.com/t35n5aHqHE
— N Chandrababu Naidu (@ncbn) January 24, 2022సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గర్జించిన నేత శ్రీ పరిటాల రవి. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన నాయకుడు పరిటాల రవీంద్ర. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత పరిటాల రవి.(1/2) pic.twitter.com/t35n5aHqHE
— N Chandrababu Naidu (@ncbn) January 24, 2022
పరిటాల స్వస్థలం అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. పరిటాల శ్రీరామ్.. కొంత మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కదిరి సహా అనంతపురం జిల్లాలోని పలుచోట్ల పరిటాల వర్థంతి నిర్వహించారు.
ఇదీ చదవండి: Atmakuru incident: జగన్ అసమర్థతతో ఏపీలో అరాచక పాలన: కేంద్రమంత్రి మురళీధరన్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!