అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని నింబగల్లు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా పరిషత్ జడ్పీసీఈఓ శోభ స్వరూపరాణి సందర్శించారు. అలాగే నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధినిర్వహణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రేణుమాకులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
ఇదీ చదవండీ...తూర్పు గోదావరి జిల్లాలో.. నిర్లక్ష్యం నడుమ టిడ్కో గృహాలు