ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని జాతీయ కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర రైతు మహాసభలను ఆయన ప్రారంభించారు. రైతుల భూములను పరిశ్రమల పేరుతో భూ సేకరణ చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతుల రుణమాఫీ ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలన్నారు. లేనిచో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.
ఇదీచదవండి... సభాపతి స్థానాన్ని దుర్వినియోగం చేశారు: రోజా