ETV Bharat / state

'రాయలసీమ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది'

author img

By

Published : Dec 9, 2020, 8:52 PM IST

రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. సీమ ప్రాజెక్టులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

somu veerraju
somu veerraju

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం తరహాలోనే రాయలసీమ ప్రాజెక్టులకు నిధులిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బుధవారం అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలవరం తరహాలోనే హంద్రీనీవాకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. తుంగభద్ర సమాంతర కాలువను నిర్మించటంతో పాటు.. నికర జలాలు కేటాయిస్తామని చెప్పారు. భాజపాకు ఓటు వేయకపోయినా రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

భాజపా, జనసేన పార్టీలు నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రైతుల తరఫున పోరాడుతున్నాయని సోము వీర్రాజు చెప్పారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.