ETV Bharat / state

''ఓబుళాపురం కేసు విచారణను.. విశాఖకు బదిలీ చేయండి'' - visakhapatnam court

ఓబుళాపురం గనుల అక్రమాల కేసును విశాఖకు బదిలీ చేయాలంటూ.. సీబీఐ న్యాయవాదులు హైదరాబాద్ లోని ప్రత్యేక న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అక్టోబరు 1న ఈ పిటిషన్​ను కోర్టు విచారణ చేయనుంది.

obulapuram
author img

By

Published : Sep 17, 2019, 8:29 PM IST

ఓబుళాపురం గనుల తవ్వకాలకు సంబంధించిన అక్రమాల కేసును.. రాష్ట్రంలోని విశాఖ న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ.. సీబీఐ న్యాయవాదులు హైదరాబాద్​లోని సీబీఐ కోర్టును కోరారు. 2011 లో దాఖలైన ఈ కేసు.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్ననాటిదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లోని అనంతపురం జిల్లా పరిధిలోని గనులు కాబట్టి.. కేసును విశాఖకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితుల తరఫు న్యాయవాదులు మాత్రం ఈ అభ్యర్థనపై అభ్యంతరం చెప్పారు. నాటి ఉత్తర్వులన్నీ హైదరాబాద్ కేంద్రంగా జారీ అయ్యాయి కాబట్టి.. ఈ కేసును బదిలీ చేయొద్దన్నారు. ఈ విషయంపై అక్టోబరు 1న హైదరాబాద్ సీబీఐ కోర్టు.. విచారణ చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.