Obulapuram Mining Case: అనంతపురం ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న టపాల శ్యాంప్రసాద్‌కు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నుంచి పిలుపువచ్చింది. ఈ వారంలో కోర్టుకు హాజరై సాధక బాధకాలు చెప్పుకోవాలని సమన్లు జారీ చేసింది. ఇటీవల కోర్టులో హాజరైన శ్యాంప్రసాద్ తనకు రక్షణ కావాలని కోరినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సీబీఐ కోర్టు డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
గతంలో సీబీఐ కోర్టు ఆదేశించినా... తమ ఇనుప ఖనిజాన్ని గాలి జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా తరలించారని, పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని గతేడాది డిసెంబరు 26 న శ్యాంప్రసాద్ ఫిర్యాదు చేశారు.
"దయచేసి నాకు సెక్యూరీటి ఏర్పాటు చేయండి. వీళ్లందరూ రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లని చెప్తే జడ్జి గారు స్పందించారన్నారు. ఆల్రేడి సెక్యురిటి అరెంజ్ చెయ్యండని డీజీపీకి పంపించడం జరిగిందన్నారు. ఆ కాపీ నాకు అందజేయడం జరిగింది. సీబీఐ వాళ్లు కూడా టపాల శ్యామ్ ప్రసాద్ ఇజ్ క్రూసియల్ విట్నేస్ ఇన్ అవర్ కేస్.. ప్లీజ్ ప్రొటెక్ట్ హిమ్ సెక్యురీటి అని చెప్పి వాళ్లు కూడా డీజీపీకి రాశారు. డీజీపీ గారి నుంచి స్పందన వస్తుందని ఆశించాము. కానీ అక్కడ నుంచి స్పందన రాలేదు." -టపాల శ్యామ్ ప్రసాద్, ఓఎంసీ ప్రధాన సాక్షి
ఇవీ చదవండి