Death: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి - కదిరిలో ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా తలుపుల మండలంలో.. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా తలుపుల మండలంలో.. గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి చిన్నపల్లి కదిరి పులివెందుల ప్రధాన రహదారి ఒదులపల్లి వద్ద.. వరద నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారిలో ఒకరు.. కదిరి పట్టణ మూర్తిపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా కుమారుడిగా గుర్తించారు. ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో కదిరి పులివెందుల మధ్య రాకపోకలు స్తంభించాయి.