అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్ వద్ద బుధవారం రాత్రి చెరువులోకి దూసుకెళ్లిన కారును పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. కారులో ఒక మృతదేహం లభ్యమైంది. చెరువులో మరో నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువు వద్ద సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
అసలు ఎం జరిగిందంటే...
బుధవారం రాత్రి దొనేకల్ వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు చెరువులోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో కారు పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న గుంతకల్ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీయించే ప్రయత్నం చేశారు.
దొనేకల్, కడగరబింకి గ్రామస్థులు సైతం భారీగా తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే.. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా.. ఇవాళ తెల్లవారుజామున కారును బయటకు తీయించారు. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీచదవండి :