అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని సైదాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నుంచి తిరుపతికి వెళ్తున్న కారు... నారపరెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడి తలకు బలమైన గాయం కావటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కారు-ద్విచక్రవాహనం ఢీ: ఒకరికి గాయాలు
కారు-ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన అనంపురం జిల్లా సైదాపురం వద్ద జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని సైదాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నుంచి తిరుపతికి వెళ్తున్న కారు... నారపరెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడి తలకు బలమైన గాయం కావటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
TAGGED:
car accident in anantapur