అనంతపురం జిల్లా మడకశిర పట్టణం సాయినగర్లో 15 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓవ్యక్తి మృతి చెందాడు. అధికారులు ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కంటెయిన్మెంట్ జోన్ పరిధిలో రాష్ట్ర రహదారి ఉన్నందున పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ నుంచి సిద్ధార్థ స్కూల్ వరకు రోడ్డుకు ఒక భాగంలో రాకపోకలు సాగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మరో భాగంలో బస్సులు, గూడ్స్ వాహనాల రాకపోకలకు అనుమతించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలను నిలిపివేయాలి. ఇక్కడ బ్యారికేడ్ లోపల ఉన్న ప్రభుత్వ విద్యుత్ శాఖ కార్యాలయం పని చేస్తోంది.
మరోపక్క ఈ జోన్ పరిధిలో రాకపోకలకు ఏర్పాటు చేసిన రహదారి పక్కన ఉన్న ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల వద్ద ప్రజలు భౌతికదూరం పాటించడంలేదు. కంటెయిన్మెంట్ జోన్‌కు నలువైపులా ఉండాల్సిన పోలీసులు కేవలం ఒకే చోట ఉండడంతో మిగిలిన చోట రాకపోకలు సాగుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు