అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి తగ్గింది. కరోనా వైరస్ దెబ్బకు కళాశాలలకు విద్యార్థులు రావడం లేదు. ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. వీరిలో చాలా మంది ఇంటర్యూలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోతున్నారు. గతేడాది నుంచి నైపుణ్య శిక్షణ తరగతులు ఆన్ లైన్ లోనే నిర్వహించడం వల్ల.. ప్రాంగణ నియామకాల సంసిద్ధత తగ్గిందని అధ్యాపకులు చెబుతున్నారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఏటా 20వేలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చే వారు. వీరంతా ప్రముఖ సంస్థల ఉద్యోగాల కోసం పోటీపడేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. విద్యార్థుల ఎంపిక విధానాన్ని మార్చుకున్న సంస్థలు ….ఆన్‌లైన్‌లో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నాయి. అందులో విజయవంతమైన వారిని మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తున్నాయి. గతంలో అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్‌లో టీసీఎస్ సంస్థ 250 పైగా విద్యార్థులను ఎంపిక చేసుకునేదని....ఇపుడు ఆ సంఖ్య బాగా తగ్గిందని ఆచార్యులు అంటున్నారు. విదేశీ సాఫ్ట్ వేర్ కంపెనీలూ 50 నుంచి 100 మందికి ఉద్యోగ ఎంపిక పత్రాలు ఇచ్చేవని...ప్రస్తుతం అవీ నియామకాలు చేయడం లేదని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకొస్తారని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీచదవండి: