ETV Bharat / state

నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన కాజ్​వే

Rains in Anantapur: అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో రాళ్ల అనంతపురం సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి కాజ్​వే కొట్టుకుపోయింది. ప్రవాహ ఉద్ధృతి పెరగటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో మారుమూల ప్రాంతమైన రాళ్ల అనంతపురానికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయిందని.. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

cajway
కాజ్​వే
author img

By

Published : Oct 12, 2022, 12:32 PM IST

Updated : Oct 12, 2022, 7:02 PM IST

Rains: అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో రాళ్ల అనంతపురం సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి కాజ్​వే కొట్టుకుపోయింది. గత రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కంబదూరు చెరువుకు నీటి ప్రవాహం అధికమైంది. దీంతో రాళ్ల అనంతపురం - ఐపార్సపల్లి మధ్యలో ఉన్న కాజ్​వేపై నీరు ప్రవహిస్తూ పెన్నా నదిలో కలుస్తోంది. ఈ ప్రవాహ ఉద్ధృతి పెరగటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో మారుమూల ప్రాంతమైన రాళ్ల అనంతపురానికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయిందని, యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 12, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.