ETV Bharat / state

రన్నింగ్​లో​ ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్.. - bus accident in ananthapuram district

bus accident
bus accident
author img

By

Published : Sep 9, 2021, 9:44 AM IST

Updated : Sep 9, 2021, 2:42 PM IST

09:42 September 09

bus accident in ananthapuram district

రన్నింగ్​లో ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. గురువారం ఉదయం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరు నుండి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కించుకొని హవళిగి వెళ్తున్న ఎపీఎస్ఆర్టీసీ బస్సు రన్నింగ్​లో ఉండగానే ఒక్కసారిగా వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డుపక్కన ఉన్న ద్విచక్రవాహనాన్ని బస్సు లాక్కొని వెళ్ళింది. ప్రయాణికులు, విద్యార్థులను మరొక బస్సులో తమ గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్​నెస్​ లేని బస్సులను ఉపయోగించడం.. కాలం చెల్లిన బస్సులను వాడటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: lokesh narsaraopeta tour: లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Last Updated : Sep 9, 2021, 2:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.