విజయనగరంలో సమన్విత పెట్రోలు బంక్ వెనుక చెరువు గట్టుపై కాలిపోయి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఎస్సై కిరణ్ నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాపై ప్రజలకు అవగాహన..కొవిడ్ ప్రచార రథాలు ప్రారంభం