ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో.. కర్ణాటక ప్రాంతంలోని తుంగభద్ర నదికి.. భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఆ నీటిని దిగువనున్న హై లెవెల్ కెనాల్ ద్వారా.. భారీ స్థాయిలో పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో.. ముంద జాగ్రత్తగా.. 3 రోజుల క్రితమే మధ్య పెన్నా 3 గేట్లను తెరిచారు అధికారులు. ఫలితంగా.. పెన్నా నది పరిసరాల్లో సాగు చేసిన వరి పైరు పూర్తిగా నీటిలో కొట్టుకుపోయింది. అంతే కాకుండా పామిడి వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన (Bridge damaged near pamidi) కూలిపోయింది. దీంతో.. కర్నూలు నుంచి అనంతపురానికి వెళ్లే వాహనాలను బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో.. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని పెనకచర్ల డ్యాంకు.. భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో.. అధికారులు 3 రోజుల క్రితమే పెనకచర్ల డ్యాం గేట్లను ఎత్తి.. నీటిని పామిడి పెన్నానదికి విడుదల చేశారు. రెండు రోజులుగా పెన్నా నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. పామిడి-కల్లూరు మధ్యగల రోడ్డులోని మొదటి వంతెన కూలిపోయింది.
దీంతో.. కర్నూల్ నుంచి అనంతపురం వెళ్లే వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా.. పట్టణ బాహ్య రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. పెన్నా నదికి అధిక నీరు ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నది వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో చాటింపు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కూలిన వంతెన రహదారిపై.. ఎవరు ప్రయాణించకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం పాస్ వంతెన మీదుగా.. వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు అధికారులు.
ఇదీ చదవండి:
Rains in Nellore district: నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు.. సోమశిల జలాశయానికి భారీ వరద