ETV Bharat / state

ఎన్నికల సంఘం బాధ్యతతో వ్యవహరించాలి: బొత్స - అనంతపురం జిల్లా వార్తలు

మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఆదేశించటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా అధికారాలనే కాదు.. బాధ్యతలను కూడా గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు.

Minister Botsa Satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Feb 7, 2021, 6:44 PM IST

ఎన్నికల సంఘం ఇప్పటికైనా అధికారాలను మాత్రమే కాదని.. బాధ్యతలను సైతం గుర్తెరిగి వ్యవహరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనంతపురంలో వైకాపా కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో బొత్స మాట్లాడారు.

గుంటూరు, చిత్తూరు ఏకగ్రీవాల విషయంలో పునరాలోచించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డిపై గృహ నిర్బంధం చేయాలని ఆదేశించడం సరికాదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రామచంద్రారెడ్డిపై ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకుని, తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో పోటీకి అనర్హతగా ప్రకటించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పల్లె పోరు: బరిలో అక్కాచెల్లెలు.. నేనున్నానంటూ బంధువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.