అనంతపురం జిల్లాలో 6 నుంచి 10 తరగతి వరకు మొత్తం 10,78,451 పుస్తకాలు అవసరమని గుర్తించారు. ఇప్పటి దాకా ముద్రణ సంస్థల నుంచి 9,88,704 పుస్తకాలు అందాయి. నిరుడు మిగిలిన పుస్తకాలు 47,367 ఉన్నాయి. మొత్తంగా 10,36,071 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఏడో తరగతికి 23 టైటిల్స్, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 27 టైటిల్స్ చొప్పున అవసరం. ఇప్పటికే సరిపడా పుస్తకాలు ఉన్నాయి. గోదాము నుంచి మండల వనరుల కేంద్రాలకు పంపడమే తరువాయి.
లెక్క తేలని ప్రాథమికం:
ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు ఏ భాషలో చదవాలని అనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునే ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతుల పుస్తకాల ముద్రణ చేపట్టలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం యథాతథంగా ఉంటే అప్పటికప్పుడు ముద్రణ చేసి సరఫరా చేయడం కొంత ప్రతిబంధకమే. ఈ విషయమై జిల్లా విద్యాధికారి శామ్యూల్ మాట్లాడుతూ, త్వరలో కలెక్టర్ చంద్రుడును కలిసి 6-10 తరగతుల పుస్తకాల సరఫరాకు అనుమతి తీసుకొని.. మండల వనరుల కేంద్రాలకు చేరుస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :