అనంతపురంలోని కదిరి డివిజన్ పరిధిలోని డిగ్రీ కళాశాలలు మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో బ్లూ మూన్ కాలేజీ జట్టు విజేతగా నిలిచింది. వారం రోజులపాటు ఈ టోర్నమెంట్ జరిగింది. మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్లూ మూన్, ఎస్ఎంజెఎల్ జట్టులు తలపడ్డాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్మిత విన్నర్స్, రన్నర్స్ కు ట్రోఫీలను అందజేశారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బ్లూమూన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో.. రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అందులో ప్రశాంత్ 103, సాయి 87 పరుగులు సాధించి టోర్నమెంట్లో జట్టు విజేతగా నిలవడానికి కృషి చేశారు. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఎంజెఎల్ జట్టు 173 పరుగులు చేసి... 19 ఓవర్లకే ఆలౌట్ అయింది.
ఇదీ చదవండి: నేటి నుంచి.. 2 రోజుల పాటు 'సీ విజిల్-21'