అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్ పర్సన్ కాపు భారతి ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయని కాపు భారతి తెలిపారు. రక్తదాన శిబిరాలకు యువత నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వందమంది యువతీ, యువకులు రక్తాన్ని దానం చేశారు.
ఇదీ చదవండి: