అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి, ముస్లిం నగారా టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనేక మంది హిందూ, ముస్లిం యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కొవిడ్ మొదలైనప్పటి నుంచి అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు లేనందున 129 మందితో రక్తదానం చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
ఇదీ చదవండి :