కుల, మత, అవినీతిరహితపాలన సాగిస్తున్న మోదీ... రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని తెలిపారు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ. తమ పాలనపై అసత్య ఆరోపణలు చేసిన నాయకులు సైతం నేడు కాషాయ కండువాలు కప్పుకొంటున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ఇలాంటి సయమంలో ప్రత్యేకహోదా అంటూ ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో విభజన తప్పదని తెలిసి ప్రజలను తప్పుదారి పట్టించారని.... ఇప్పుడూ అదే దారిలో వెళ్తున్నారని ఆరోపించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందని... వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి పూర్తి సమయం తెలుగు తమ్ముళ్ల కోసమే..!