వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... దళితులు తీవ్రంగా నష్టపోయారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ ఆరోపించారు. దళితుల పక్షాన ప్రభుత్వంతో పోరాడటానికి భాజపా ఎస్సీ నగర కమిటీని ఏర్పాటు చేశామన్న దేవానంద్... సంక్షేమ పథకాలు దళితులకు అందని ద్రాక్షలా మారాయన్నారు.
రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు జరుగుతున్నాయని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
volunteer: వ్యాక్సిన్ వేయించుకోలేదని... 65 మంది వాలంటీర్ల తొలగింపు!