కేంద్ర ప్రభుత్వ నిధులను వైకాపా ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించి రోడ్లకు మరమ్మతులు చేయాలని... అనంతపురం జిల్లా మడకశిరలో భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. అమరాపురం, గుడిబండ, అగళి మండలాల్లోని పలు గ్రామాల్లో గుంతలు పడిన మట్టిరోడ్లపై భాజపా నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
గ్రామాల్లో త్రాగునీటికి, మురుగు కాలువలకు, తారు రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం వాటిని సక్రమంగా ఉపయోగించకుండా దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించకుండా... వాటిని మౌలిక వసతులకు ఉపయోగించి ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
నార్పలలో
నార్పల మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... భాజపా నాయకులు మండిపడ్డారు. ప్రధాన రహదారి పనులు చేయడంలో అధికారులు నత్తనడక పనులు సాగుతోందని మండిపడ్డారు. మండల కేంద్రంలో కూతలేరు వంతెన నిర్మాణం పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని... నిర్మాణానికి కావలసిన పరికరాలు కూడా నాసిరకమైనవి వాడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: