పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో వైకాపా యువజన విభాగం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి నగరంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. 'ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న తెదేపా అంశాలను ఖండిస్తున్నామంటూ ర్యాలీని సాగించారు. వైకాపా చేస్తున్న అభివృద్ధికి తెదేపా మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: 'అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు'