అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. హనుమంతప్ప అనే రైతు ఉదయం పొలం పనులకు వెళ్తుండగా.. ఎలుగుబంటి, తన మూడు పిల్లలతో కలిసి దాడి చేసినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు గట్టిగా హారన్ కొట్టడంతో ఎలుగులు వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన హనుమంతప్పను ప్రథమ చికిత్స అనంతరం.. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: