గతేడాది నీటి సౌకర్యం లేక నష్టపోయిన అనంతపురం జిల్లా బత్తాయి రైతులు... ఈ ఏడాది మార్కెట్‌కు పంటను తీసుకెళ్లలేక దిగాలు చెందుతున్నారు. 12 నెలల క్రితం టన్ను బత్తాయి డెబ్బై వేల రూపాయలకు అమ్ముకున్న రైతులు... ఈసారి కొనటానికి వచ్చే వ్యాపారులే లేక ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం నుంచి ఏటా 20 మంది బత్తాయి వ్యాపారులు గార్లదిన్నె మండలానికి వచ్చి పంట కొనుగోలు చేసి... నేరుగా దిల్లీ మార్కెట్‌కు తరలించేవారని రైతులు అంటున్నారు. లాక్డౌన్తో వ్యాపారులు అనంతపురం జిల్లాకు రాలేకపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన వ్యాపారులకు తమ పంట కొనుగోలుకు అనుమతించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: జియోకు అమెజాన్ పోటీ- కిరాణా సరకుల కోసం కొత్త యాప్