దేశంలోనే మొట్టమొదటి సారిగా గూడ్స్ రైలుకు ఏసీ కంటైనర్లు ఏర్పాటు చేసి... అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి అరటిపండ్లను అరబ్ దేశాలకు ఎగుమతి చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాల్లో పండే అరటి పండ్లకు నాణ్యత ఎక్కువ. గుజరాత్‌కు చెందిన దేశాయి కంపెనీ... 'హ్యాపీ బనానా' పేరుతో అరటి పండ్లు కొనుగోలుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీ వారు పంట ప్రారంభ దశ నుంచే... అరటి నాణ్యత బాగుండేలా రైతులకు ఉచితంగా సామగ్రి అందిస్తారు.
పంటకోత సమయానికి మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ఈ కంపెనీ వల్ల రైతులు దళారుల చేతుల్లో దగా పడకుండా... తమ పంటను నష్టం లేకుండా అమ్ముకోవచ్చు. కంపెనీ వారు అరటి పండ్లను ఒక వినూత్న పద్ధతిలో ప్యాక్ చేసి ఏసీ కంటైనర్లలో ఉంచుతారు. రైలు మార్గం ద్వారా ఈ కంటైనర్లు దేశ సరిహద్దు వరకు వెళతాయి. అక్కడి నుంచి షిప్‌ల ద్వారా అరబ్ దేశాలకు చేరవేస్తారు. ప్రారంభం రోజునే 49 కంటైనర్లలో... 980 మెట్రిక్ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేశారు.
అనంత జిల్లాలో పండే ఉద్యాన పంటలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని... రాష్ట్రంలో పండే ఉద్యాన పంటలో 30 శాతం అనంతపురం జిల్లాలోనే పండుతాయని అధికారులు వివరింస్తున్నారు.
ఇదీ చదవండీ...