ఇవీ చదవండి..
అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట - దగ్ధం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో గత రాత్రి 12:30గంటల సమయంలో కురుబ భీమప్ప అనే రైతుకు చెందిన అరటి తోట విద్యుత్ వైరు తాకి దగ్ధమైంది.
అగ్నికి ఆహుతైన అరటితోట
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో గత రాత్రి 12:30గంటల సమయంలో కురుబ భీమప్ప అనే రైతుకు చెందిన అరటి తోట విద్యుత్ వైరు తాకి దగ్ధమైంది. గాలిమరల కాపలాదారులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే 4 ఎకరాల తోట పూర్తిగా కాలిపోయింది. దాదాపుగా 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. చేతికి అందివచ్చిన పంట మంటలకు ఆహుతై జీవనాధారం కోల్పోయానని... ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
sample description